వ్యవసాయరంగ బలోపేతానికి కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రభుత్వ సూచనలను పాటిస్తూ రైతన్నలు సాగుతో సిరులు పండించాలని అన్నారు. దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు చంద్రబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. భూమిని, పశుసంపదను పూజించి ప్రకృతి సాగుతో పంటలు పండించి మన భూమిని, మన ఆరోగ్యాన్ని..విషతుల్యం కాకుండా కాపాడుకుందామని పిలుపునిచ్చారు. పాడి పంటలతో రైతన్న ఇళ్లలో వెలుగులు నిండాలని చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నారు.