వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి మంత్రాలయం నుంచి వనపర్తికి వస్తున్న బస్సు 44వ నంబర్ జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టడంతో అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో సుమారు 20 మంది వరకు ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. బస్సు బోల్తా కొట్టి రోడ్డుకు అడ్డంగా పడటంతో రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.క్షతగాత్రులను పెబ్బేరు ఆస్పత్రితో పాటు వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.