అయోధ్య రామాలయం ఆలయానికి సమర్పించిన కానుకలను చోరీ చేసిన కేసులో సీబీఐ నేతృత్వంలో సత్వర విచారణ చేపట్టాలని పిటీషన్ దాఖలైంది. ఆ పిటీషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు ఇవాళ నిరాకరించింది. వేసవి సెలవులు ముగిసిన తర్వాత విచారణ చేపడుతామని, ఇప్పుడేం ఆకాశం ఊడి పడడం లేదని కోర్టు అభిప్రాయపడింది. చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామాలు అందినట్లు ట్రస్టు కన్ఫర్మ్ చేసింది. తమ తదుపరి సమావేశంలో వీటిపై చర్చిస్తామన్నారు. శ్రీరాముడికి సమర్పించిన అన్ని బంగారు, వెండి ఆభరణాలు సురక్షితంగా ఉన్నట్లు ట్రస్టు పేర్కొన్నది.

