జమ్మూ కాశ్మీర్, పూంచ్ జిల్లాలోని బాలాకోట్ సెక్టార్ ప్రాంతంలో నియంత్రణ రేఖ (LoC) సమీపంలో మరో పాకిస్తానీ జాతీయుడిని భారత భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అరెస్టైన వ్యక్తిని హవేలీ జిల్లాకు చెందిన 31 ఏళ్ల రయీస్ ఖాన్‌గా గుర్తించారు. అతడు మహమ్మద్ యాకూబ్ ఖాన్ కుమారుడని అధికారులు తెలిపారు. ప్రాథమిక తనిఖీల్లో అతని వద్ద ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, నేర కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలు లభించలేదని అధికారులు వెల్లడించారు.