ఏపీ రాజధాని అమరావతిలోని ఉండవల్లిలో ఇటీవల వైసీపీ నాయకుల పర్యటన తీవ్ర ఉద్రిక్తత సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మళ్లీ అమరావతి పర్యటనకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. అమరావతి ప్రాంతంలో రేపు మళ్లీ వైసీపీ కమిటీ పర్యటిస్తుందని, రైతులకు పార్టీ అండగా ఉంటుందని అవినాష్ స్పష్టం చేశారు. తమను ఎంతమందితో అడ్డుకుంటారో చూస్తామన్నారు. పోలీసులు, టీడీపీ శ్రేణులు, రౌడీలు, గూండాలు ఎవరిని తీసుకొస్తారో రావాలంటూ సవాల్ విసిరారు.