ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఎంతో జాగ్రత్తగా ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ ఏపీలో పరిషత్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో చెల్లని ఓట్లు ఎక్కువగా నమోదవుతున్నాయి కొన్ని మండలాల్లో మెజారిటీ పోస్టల్ బ్యాలెట్లు చెల్లకుండా పోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఓటు ఎలా వేయాలో తెలియకపోయిందా? లేక బ్యాలెట్ పత్రాలపై సరైన అవగాహన లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.