<span;>తిరుపతి జిల్లా పాకాల మండలం పల్లగుట్టపల్లి గ్రామానికి చెందిన రైతు బి. తిమ్మారెడ్డి (65) ఏనుగుల దాడిలో దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారుు. తిమ్మారెడ్డి మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.బాధాకరమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అటవీ శాఖ అధికారుల నుంచి తెలుసుకున్నారు.
<span;>అటవీ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం ఆ కుటుంబాన్ని పరామర్శించి తక్షణం పరిహారం అందించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు