భారత జిమ్నాస్టిక్స్ కొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా జూనియర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ షిప్ లో భారత యువ జిమ్నాస్ట్లు అదరగొట్టారు. హర్షిత్ దామోదరన్ స్వర్ణ పతకం గెలిచాడు. అక్షత్ బజాజ్ రజతం సాధించాడు. ఒకే ఈవెంట్ లో భారత్ గోల్డ్, సిల్వర్ గెలవడం ఆసియా ఛాంపియన్ షిప్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ విజయం భారత జిమ్నాస్టిక్స్కు కొత్త ఆశలు నింపింది. చైనాలోని జున్యిలో జరిగిన జూనియర్ మెన్స్ వాల్ట్ ఫైనల్లో హర్షిత్ 13.649 పాయింట్లు, అక్షత్ 13.433 పాయింట్లు సాధించాడు.