చైనా రాజధాని బీజింగ్‌లో అత్యంత ఎత్తైన 108 అంతస్తుల “సిటిక్ టవర్” భవనాన్ని ఒక చిన్న విమానం ఢీకొట్టింది. రెండు సీట్ల స్పోర్ట్స్ విమానం నియంత్రణ కోల్పోయి ఈ భారీ భవనం పై అంతస్తుల్లోకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదం వల్ల భవనం పైభాగంలో ఉన్న రెండు భారీ గ్లాస్ ప్యానెల్స్ పగిలి పోయాయి. విమాన శకలాలు, అద్దపు ముక్కలు కింద రోడ్డుపై పడ్డాయి. అయితే, ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక నివేదికలు రాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే భవనంలోని వారందరినీ ఖాళీ చేయించారు.