తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం పలువురు సీనియర్ IAS అధికారులను బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో అత్యంత ప్రాధాన్యత కలిగిన ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పదవిలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్.శ్రీధర్‌ను నియమించింది. పరిపాలనాపరంగా సీఎంఓ (CMO) ఎంతో కీలకమైనది కావడంతో, నమ్మకమైన మరియు సమర్థుడైన అధికారిగా శ్రీధర్‌కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అజిత్ రెడ్డిని బదిలీ చేస్తూ, ఆయనను అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సీఈఓగా నియమించడం విశేషం.