భారత్-ఐర్లాండ్ తొలి టీ20 మ్యాచ్ కు ముందు వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తుది ప్లేయింగ్ ఎలెవన్ లో అతనికి చోటు దక్కలేదు. దీంతో టీమిండియా తరఫున అతని తొలి అంతర్జాతీయ మ్యాచ్ మరోసారి వాయిదా పడింది. వైభవ్ అవకాశం లభిస్తే భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా నిలిచేవాడు. ప్రస్తుతం ఆ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిటే కొనసాగుతోంది. అందువల్ల ఈ మ్యాచ్ ఆ రికార్డు బద్దలయ్యే అవకాశం లేకుండాపోయింది.

