వెనెజువెలాలో భూకంపం పెను విషాదం నింపింది. ఈ భూ విలయం సృష్టించిన విధ్వంసంలో మృతుల సంఖ్య 589కి పెరిగింది. గాయపడిన వారి సంఖ్య 3 వేలు దాటింది. ఈ మేరకు ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ వివరాలను వెల్లడించారు. అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న లా గువేరా ప్రావిన్సులో దాదాపు 100కు పైగా భారీ భవనాలు నేలమట్టమైనట్లు గల్లంతైన వారి వివరాలను సేకరించేందుకు ఏర్పాటు చేసిన వెబ్సైట్లో ఇప్పటివరకు దాదాపు 50 వేల మంది పేర్లు నమోదైనట్లు సమాచారం.