శుక్రవారం తెల్లవారుజామున రష్యాపై భారీ స్థాయిలో డ్రోన్ దాడులకు పాల్పడింది ఉక్రెయిన్. ఈ దాడిలో రష్యాలోని 12 ప్రాంతాలతో పాటు రష్యా ఆక్రమణలో ఉన్న క్రిమియా ద్వీపకల్పం, నల్ల సముద్రం, అజోవ్ సముద్రం మీదుగా వచ్చిన 660 ఉక్రెయిన్ డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో, అలాగే రష్యా అక్రమంగా ఆక్రమించుకున్న క్రిమియాపై జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడుల్లో ఇది ఒకటిగా భావిస్తున్నారు.