రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎస్ పదవీ కాలం జూన్ 30తో ముగియనుంది. అదే రోజున సంజయ్ జాజు రాష్ట్ర అత్యున్నత బ్యూరోక్రాటిక్ పదవిని స్వీకరించనున్నారు 1992 బ్యాచ్ తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన.. గతంలో ఉమ్మడి ఏపీలో ఐటీ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా నేటికీ ప్రజలకు అందుబాటులో ఉన్న విప్లవాత్మక డిజిటల్ సేవలైన మీసేవ , మున్సిపల్ పరిధిలో సౌకర్యం ప్రాజెక్టులను డిజైన్ చేసి అమలు చేసిన ఘనత సాధించారు.