తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యలో మార్పులు చేశారు. ఇకమీదట ఇంటర్ మొదటి సంవత్సరంలోనూ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సంవత్సరంలో 15 మార్కులు, రెండో ఏడాది 15 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. గణితంలో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌ని బోర్డు ప్రవేశపెట్టింది. గణితంలో 75 మార్కులకు బదులు 60 మార్కులకు ఫైనల్ పరీక్షలుంటాయి. ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు ఒక్కో ఏడాదికి 15 మార్కులు కేటాయించనున్నారు.

