యూఎస్ కాంగ్రెస్ ఉభయ సభల్లో డెమోక్రాట్లదే మెజార్టీ కావడం వాల్స్ట్రీట్లో మదుపర్లకు ఉత్సాహానిచ్చింది. దాంతో అగ్రరాజ్య మార్కెట్లు మూడు నెలల గరిష్ఠాలకు ఎగబాకాయి. డోజోన్స్ 1500 పాయింట్లు ఎగబాకగా.. ఎస్అండ్పీ 500, నాస్డాక్ వరుసగా 1.58 శాతం, 1.44 శాతం మేర లాభపడ్డాయి. పన్ను కోతలు, వ్యాపార అనుకూల విధానాలు, నియంత్రణ సడలింపులతో డొనాల్డ్ ట్రంప్ ను స్టాక్ మార్కెట్కు అనుకూలమైన వ్యక్తిగానే మదుపర్లు చూశారు. తాజా ఫలితాలతో పశ్చిమాసియాలో యుద్ధ భయాలు తగ్గి చమురు ధరలు అమాంతం దిగొచ్చాయి.