సందీప్‌కి ప్రకాశ్ రాజ్‌కి గొడవ జరిగిందని.. ప్రకాశ్ రాజ్ ఈ సినిమాలో నటించడం లేదు అని సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి ప్రకాశ్ రాజ్ ఈ ఫేక్ న్యూస్‌లను ఖండించారు. ‘‘స్పిరిట్ గురించి విషపూరిత ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న వారందరికీ ఒక్కటే చెబుతున్నా..ఈ సినిమాకు సంబంధించి నేను నటించే ఒక్క సీన్ కూడా ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. కానీ, వాట్సాప్ ఫ్యాక్టరీలో ఊహాజనిత కథనాలు అల్లేస్తున్నారు. ఇప్పటికైనా నిద్ర లేవండి.. ఎవరి పని వాళ్లు చూసుకోండి’’ అని ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు.

