హెచ్ఐవీ కేసుల్లో దేశంలోనే అగ్రస్థానంలో మేఘాలయ నిలిచింది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం పది వేల మందికిపైగా ఎయిడ్స్ రోగులు చికిత్స పొందుతున్నారు. మేఘాలయ ఆరోగ్య మంత్రి స్వయంగా ఈ విషయాన్ని అసెంబ్లీకి వెల్లడించారు.
గత పదేళ్లలో మేఘాలయలో హెచ్ఐవీ కారణంగా 749 మంది మరణించినట్లు ఆరోగ్య మంత్రి షిల్లా తెలిపారు. తూర్పు ఖాసీ హిల్స్‌లో 435, పశ్చిమ జైంటియా హిల్స్‌లో 123, తూర్పు జైంటియా హిల్స్‌లో 90, రి భోయ్లో 51ఎయిడ్స్ మరణాలు నమోదైనట్లు చెప్పారు.

