సికింద్రాబాద్‌ను మున్సిపల్ కార్పొరేషన్‌గా చేయాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జంట నగరాల్లో సికింద్రాబాద్ ఎన్నో సంవత్సరాలుగా అన్నింటికీ కేంద్రంగా ఉందని తెలిపారు. అటువంటి సికింద్రాబాద్ పేరు లేకుండా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించడం సరికాదని ఆయన అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. లేనిపక్షంలో బిజెపి అధ్వర్యంలో సికింద్రాబాద్ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.

