ఏపీ సీఎం చంద్రబాబు రెడ్ బుక్‌తో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పి, జంగిల్ రాజ్‌లా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని హెచ్చరించారు. ఇటీవల గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ మూకల దాడి, అంబటి రాంబాబు అరెస్టు వ్యవహరం తరువాత బుధవారం అంబటి కుటుంబాన్ని జగన్ పరామర్శించి ఓదార్చారు.

