దక్షిణా అమెరికాలోని బొలీవియా ప్రాంతంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్ ఆల్టో విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా రన్ వే నుంచి పక్కకు జరిగి రోడ్డుపైకి దూసుకెళ్లడంతో 15 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడడంతో డెల్ నార్టే ఆస్పత్రికి తరలించారు. నోట్ల కరెన్సీలో లోడుతో విమానం సాంటా క్రజ్ నుంచి ఎల్ ఆల్టో కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం నుంచి నోట్ల కట్టలు బయటపడడంతో స్థానికులు ఎగబడ్డారు.

