బీహార్ సీఎం నితీశ్ కుమార్.. ఇవాళ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి ఖ్యాతి సింగ్ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నామినేషన్ పేర్లను అందజేశారు. రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసినట్లు నితీశ్ తన ఎక్స్‌లో వెల్లడించారు. బీహార్‌కు అత్యధిక కాలం సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తిగా నితీశ్ రికార్డు క్రియేట్ చేశారు.

