కుంభమేళాలో సెన్సేషన్ మోనాలిసా జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు నమోదైంది ఈ క్రమంలోనే ఇప్పుడు మోనాలిసా కనిపించడం లేదనే వార్త వెలుగులోకి వచ్చింది. తాజాగా రాజస్థాన్‌లోని అజ్మేర్, పుష్కర్ పర్యటనకు వెళ్ళిన సమయంలో “మోనాలిసా పారిపోయింది.. ఆమె కోసం అజ్మేర్ అంతా వెతికాను, ఇప్పుడు జోధ్‌పూర్ వెళ్తున్నాను” అంటూ ఫర్మాన్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ అదృశ్యం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు.

