ఉద్యోగులు, పెన్షనర్లు, వారి డిపెండెంట్లకు నగదు రహిత అపరిమిత వైద్య సేవలు అందేలా కొత్త ఈహెచ్ఎస్ పథకం ఉంటుందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. రాష్ట్రంలో ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని పది రోజుల్లో ప్రారంభించాలని నిర్ణయించారు. ఉద్యోగులు తమ మూల వేతనంలో ఒకటిన్నర శాతం చందా ఇస్తే అంతే మొత్తంలో ప్రభుత్వం వాటాగా ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన ఉద్యోగుల హెల్త్‌కేర్ ట్రస్ట్ సమావేశం జరిగింది.

