ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కీలక పెండింగ్ సమస్యలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పరిపాలనాపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా రాష్ట్ర భద్రత ,శాంతిభద్రతల అంశాలతో పాటు, విభజన చట్టంలోని హామీల అమలు కోసం కేంద్రం నుండి అందాల్సిన పూర్తి సహకారంపై ఆయన విన్నవించారు. ఉప్పాడ తీర ప్రాంత కోతను అరికట్టేందుకు సీ ప్రొటెక్షన్ వాల్ ప్రాజెక్టు గురించి పవన్ కల్యాణ్ హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

