ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. చిల్లకల్లు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త డి. రాంబాబు (45) స్వాగత ఏర్పాట్లలో భాగంగా జోగి రమేష్ నివాసం వద్దకు చేరుకున్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. పల్స్ పడిపోవడంతో అక్కడున్న నేతలు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బైక్‌పై స్టంట్ చేస్తూ రోడ్డుపై ఉన్న గేట్‌ను వేగంగా ఢీకొని మరో వ్యక్తి మృతి చెందాడని సమాచారం.

