నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం తొలిసారి పర్యటించి, ప్రతిష్టాత్మక వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి జనవరిలోనే నూతన జిల్లాను ఏర్పాటు చేశామని, ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టును కూడా శరవేగంగా పూర్తి చేసి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. తాగునీటి కష్టాలకు
శాశ్వత పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.

