కువైట్ సమీప సముద్రంలో ఆయిల్ ట్యాంకర్‌లో భారీ పేలుడు సంభవించింది. ముబారక్ అల్-కబీర్ పోర్టుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు యూకే మెరైన్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (UKMTO) అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటన కువైట్ భూభాగ జలాల వెలుపల జరిగినట్లు అధికారులు స్పష్టం చేశారు. పేలుడు కారణంగా ట్యాంకర్‌లోకి నీరు చేరినట్లు సమాచారం. పేలుడు ప్రభావంతో నౌకలోని కార్గో ట్యాంక్ దెబ్బతినడంతో సముద్రంలోకి చమురు లీక్ అవుతున్నట్లు యూఏఈ, కువైట్ అధికారులు గుర్తించారు.

