అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ రెండు దేశాలు సంయక్తంగా ఇరాన్‌పై మిసైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే ఇరాన్లో ఓ స్కాల్పై బాంబులు పడడంతో సుమారు 50 మంది వరకు విద్యార్థులు మృతి చెందారు. అయితే తాజాగా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నసీర్జాదే ,రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మొహమ్మద్ పక్పూర్ మరణించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ కూడా మృతి చెందినట్టు స్థానిక మీడియాలు పేర్కొన్నాయి.

