న్యూక్లియర్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం దిశగా ఉత్తర కొరియా కీలక ముందుడు వేసింది. అణ్వస్త్ర ప్రయోగ సామర్థ్యాన్ని కలిగిన నౌకాదళం నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది. మరో రెండు రోజుల్లోగా దేశ నౌకాదళంలోకి ప్రవేశపెట్టనున్న కొత్త యుద్ధ నౌక (డెస్ట్రాయర్)ను కిమ్ తనిఖీ చేశారు. ప్రయోగపూర్వకంగా ఈ యుద్ధ నౌక నుంచి క్రూయిజ్ మిస్సైల్‌ను సంధించడాన్ని కిమ్ వీక్షించారు. ఈ వివరాలతో ఉత్తర కొరియా ప్రభుత్వ వార్తాసంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ గురువారం రోజు కథనాన్ని ప్రచురించింది.

