తెలంగాణలో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఎన్యూమరేషన్ ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 77.66 శాతం మంది ఓటర్ల వివరాలు మాత్రమే డిజిటలైజ్ అయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.నివాస స్థలాల్లో అందుబాటులో లేకపోవడం వల్ల దాదాపు 40 లక్షల మంది ఓటర్లను ‘నాట్ ట్రేస్డ్’ కేటగిరీ కింద గుర్తించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు డూప్లికేట్ (నకిలీ) ఓట్లు ఉన్నవారు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారై ఇక్కడే ఓటు హక్కు కలిగి ఉన్నవారు మరో 20 లక్షల వరకు ఉంటారని అధికారులు భావిస్తున్నారు.