FCRA Amendment Bill-2026 ఈ కొత్త చట్ట సవరణ భారత్‌లోని క్రిస్టియన్ వర్గాలను లక్ష్యంగా చేసుకుని తెచ్చిన దాడిలా ఉందని అమెరికన్ రిపబ్లికన్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు రిలే మూర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నిబంధనలు ఇలాగే కొనసాగితే ఇరు దేశాల ద్వైపాక్షిక మైత్రి దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు.ఎఫ్‌సీఆర్ఏ లైసెన్సులు కోల్పోయిన లేదా వాటి పునరుద్ధరణ కాని చర్చిలు, స్వచ్ఛంద సంస్థల ఆస్తులను ప్రభుత్వ పరం చేసేలా నిబంధనలు మార్చడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.