ఝార్ఖండ్లో పోటీ పరీక్షల నిర్వహణ తీరుపై అభ్యర్థులు, నిరుద్యోగ యువత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) ప్రిలిమ్స్ ఫలితాల్లో అధికారిక కటాఫ్ మార్కుల వివరాలను వెల్లడించకపోవడం, అలాగే అభ్యర్థుల OMR షీట్లను విడుదల చేయకపోవడంతో నియామక ప్రక్రియపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకత లోపించిందని ఆరోపిస్తూ వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తున్నారు.