చెన్నైలోని ఆర్.బి. చౌదరి నివాసానికి చేరుకున్న విజయ్, ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. తండ్రి మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆర్.బి. చౌదరి కుమారుడు, హీరో జీవాను చూడగానే విజయ్ భావోద్వేగానికి లోనయ్యారు. జీవాను దగ్గరకు తీసుకుని, ఆత్మీయంగా హగ్ చేసుకుని ఓదార్చారు. తండ్రిని కోల్పోయిన బాధను భరించే శక్తి ఆ దేవుడు జీవా కుటుంబానికి ప్రసాదించాలని విజయ్ కోరుకున్నారు.