ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టుకు త్వరితగతిన సాంకేతిక మరియు ఆర్థిక ఆమోదం తెలపాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. దాదాపు రూ. 38,595 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను (DPR) ఇప్పటికే కేంద్రానికి సమర్పించినట్లు సీఎం గుర్తుచేశారు. పెరుగుతున్న నగర జనాభా మరియు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ విస్తరణ అత్యంత ఆవశ్యకమని ఆయన వివరించారు.