పొత్తు ధర్మాన్ని విడనాడి తమిళనాడులో టివికెతో ఎన్నికల తర్వాత కూటమికి సిద్ధపడడం ద్వారా తమ పార్టీకి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని డిఎంకె ఆరోపించింది. బుధవారంనాడు చెన్నైలో డిఎంకె అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై మాట్లాడుతూ.. టివికెకు మద్దతు ప్రకటిండం తమిళులకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడవడమేనని అన్నారు. తమిళనాడులో డిఎంకె అధికారంలో ఉండగా తాము ఎప్పుడైనా ఒక్క పదవైనా అడిగామా అని కాంగ్రెస్ మీడియా, పబ్లిసిటీ సెల్ చైర్మన్ పవన్ ఖేరా అన్నారు. డిఎంకె తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు.