తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే టీవీకే అధ్యక్షుడు విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మరో ఆరు సీట్లు తక్కువ పడుతున్నాయి. విజయ్‌కి కాంగ్రెస్ పార్టీ మాత్రమే మద్దతు పలికింది. వీసీకే, సీపీఐ, సీపీఐ (ఎం), ఐయూఎంఎల్ లాంటి చిన్న పార్టీలు మాత్రం టీవీకేకు మద్దతిచ్చేందుకు ససేమీరా అంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీకేకు అన్నాడీఎంకే సహకరించదని అన్నాడీఎంకే డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుసామి స్పష్టంచేశారు.