తమ వీసాలలోని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) విభాగాన్ని దుర్వినియోగం చేస్తూ, అత్యంత అనుమానాస్పద యజమానుల వద్ద పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్న, భారతదేశానికి చెందిన పలువురు విద్యార్థులతో సహా 10,000 మంది విదేశీ విద్యార్థులను గుర్తించినట్లు యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) తెలిపింది. విద్యార్థి వీసాపై అమెరికాలోకి ప్రవేశించిన విదేశీ పౌరులు, 12 నెలలు లేదా 24 నెలల పాటు పనిచేయడానికి OPT అనుమతిస్తుంది. అలాగే, యజమానులు స్పాన్సర్ చేసే H-1B వీసాకు మారడానికి కూడా ఇది విద్యార్థులకు వీలు కల్పిస్తుంది.

