కేవలం లక్షల కోట్ల రూపాయల భూదోపిడికి పాల్పడేందుకే ధరణిని మూసివేసి భూభారతిని తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ నిప్పులు చెరిగారు కేటీఆర్. తన తండ్రి భూస్వామి అని ఆయనకు వందల ఎకరాలు ఉండకూడదా అని ప్రశ్నించారు. తాను అమెరికాలో చదువుకొని, ఉద్యోగం చేసిన డబ్బుతో భూములు కొనుక్కుంటే రేవంత్ రెడ్డి అవన్నీ అక్రమంగా రాయించుకున్న భూములని చెప్పడంపై సెటైర్ వేశారు. గోడలపై రాతలు రాసుకున్న నీకు జూబ్లిహిల్స్ లో ప్యాలెస్, నీ తమ్ముళ్లకు ఏరో స్పెస్ కంపెనీలు ఎలా వచ్చాయో చెప్పగలవా అంటూ ప్రశ్నించారు.