ప్రధాని మోదీ 76వ పుట్టినరోజుతో పాటు ప్రభుత్వాధినేతగా పాతికేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బీజేపీ గురువారం నుంచి నెల రోజులపాటు దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’కు శ్రీకారం చుడుతోంది. స్కూళ్లలో పిల్లలకు చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు, రక్తదాన శిబిరాలు, బైక్ ర్యాలీలు, పాదయాత్రలు, సైకిల్ యాత్రలతోపాటు.. అక్టోబరు 17 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టనుంది.