దేశంలో గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలు 80 ఏళ్లుగా ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నాయని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. అందువల్ల గురువారం నుంచి మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి ‘ఆదివాసీ స్కూల్ టీక్ కరో ఆందోళన్’ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటోన్న సమస్యలు, వివక్షను ప్రభుత్వాల దృష్టికి తేవడమే ఈ ఆందోళన లక్ష్యమన్నారు. సీజేపీ ప్రతినిధులు గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలను సందర్శించి అక్కడి మౌలిక వసతులు, సదుపాయాలను పరిశీలిస్తారని తెలిపారు.