కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించి ఎస్ఐ, సిఐలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రూ.5 లక్షలు లంచం తీసుకున్న కీసర సిఐ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్రెడ్డిని ఎసిబి అదుపులోకి తీసుకుంది. ఓ కేసు విషయంలో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు సిఐ ఆంజనేయులు రూ.10 లక్షలు డిమాండ్ చేయగా… రూ.5లక్షలకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. గణేష్ నిమజ్జనం డ్యూటీలో ఉన్న ఎస్ఐ రూ. 5లక్షలు లంచం తీసుకున్నాడు.