తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నాంపల్లిలోని చారిత్రాత్మక పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. పబ్లిక్ గార్డెన్స్‌కు వెళ్లే ముందు సీఎం రేవంత్ రెడ్డి గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని సందర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.