E20 ఇంధనం వల్ల ఇంజిన్‌లు దెబ్బతింటున్నాయంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న వేళ, 2021లో ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) నిర్వహించిన అధ్యయనం మరోసారి చర్చనీయాంశంగా మారింది. E20 పెట్రోల్ వినియోగం వల్ల లోహ భాగాలపై పెద్దగా ప్రభావం లేకపోయినా, కొన్ని రబ్బర్ & ప్లాస్టిక్ భాగాలపై దీర్ఘకాలంలో ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. దీర్ఘకాలం E20 వినియోగిస్తే ఈ భాగాలు వేగంగా అరిగిపోయే అవకాశం ఉందని అధ్యయనం సూచించింది.