సూర్యాపేట జిల్లాలో అర్వపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గాల కొట్టుకున్నాయి. దీంతో అర్వపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తుంగతుర్తి కాంగ్రెస్ మండల అధ్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యే ఏకపక్షంగా చేపట్టారని ఎంపీ చామల ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ ఎంపీ వర్గీయులు గాంధీ భవన్‌కు వెళ్తుండగా సామేల్ అనుచరులు రాళ్లు, కర్రలతో దాడికి దిగారు ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. అదికాస్త ముదరడంతో ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు.