రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ల శాఖల మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ విదేశీ పర్యటనలో భాగంగా ఆయన కొరియాలోని ప్రముఖ పారిశ్రామిక నగరమైన బుసాన్లో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కొరియా దిగ్గజ కంపెనీలకు మధ్య బలమైన వారధిగా నిలిచేందుకు ఏపీఈడీబీ (APEDB) ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘అపెక్స్-కొరియా’ పెట్టుబడిదారుల సహాయ కేంద్రాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ‘బీఎన్కే ఫైనాన్షియల్ గ్రూప్’ ఉన్నతస్థాయి బృందంతో మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.