సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 18 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. 85 శాతానికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత 3శాతం తగ్గడం గమనార్హం. ఫలితాల్లో బాలికలదే పైచేయి. 88 శాతం బాలికలు, 82 శాతం బాలురు పాస్ అయ్యారు. విద్యార్థులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్ వివరాలతో https://cbseresults.nic.in వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు

