loader

శివాల‌యాల‌పై బాంబులు : కంబోడియా ర‌క్ష‌ణ‌శాఖ‌

థాయ్‌లాండ్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు కంబోడియా సరిహద్దులోకి చొరబడి అక్కడ ఉన్న హిందూ ఆలయాలపై బాంబులు వేసినట్లు కంబోడియా రక్షణ శాఖ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నాలుగు సార్లు విమానాలు బాంబులు విసిరాయని స్పష్టం చేశారు. ఈ ఘటనను కంబోడియా రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ మాలీ సొచియాటా మీడియా ముందు వెల్లడించారు.

బంగ్లాలో తాలిబన్‌ తరహా పాలన..! మహిళల దుస్తువులపై ఆంక్షలు

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం మరోసారి వివాదంలో చిక్కకున్నది. తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం మహిళలు ధరించే దుస్తులపై ఆంక్షలు విధించింది. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు నిరసనలు చేపట్టకుండా నిషేధం విధిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. యూనస్‌ తాలిబన్‌ పాలన తరహా ఆదేశాలపై మండిపడుతున్నారు. చీరలు, సల్వార్‌ కమీజ్‌ సహా ఒళ్లంతా కప్పి ఉండేలా దుస్తులు ధరించాలని ఆదేశించింది. మహిళలు హెడ్‌స్కార్ఫ్, హిజాబ్ ధరించాలని, ఫార్మల్ షూస్, శాండల్స్ ఉపయోగించాలని ఉత్తర్వులు జారీ […]

థాయ్‌లాండ్‌, కాంబోడియా ఘర్షణలు తీవ్రం.. భారతీయులకు కీలక అడ్వైజరీ

థాయ్‌లాండ్‌, కంబోడియా. మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలలో ఓ సైనికుడితోపాటు 15 మంది మరణించారు. తాజా ఉద్రిక్తతలతో భారత్‌ అప్రమత్తమైంది. ఈ మేరకు భారతీయుల కోసం థాయ్‌లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక అడ్వైజరీ జారీ చేసింది. భారత పౌరులు థాయ్‌లోని ఏడు ప్రావిన్స్‌లవైపు ప్రయాణించొద్దని సూచించింది. ఉబోన్‌ రాట్చథాని, సురిన్‌, సిసాకెట్‌, బురిరామ్‌, సా కాయో, చంతబురి, ట్రూట్‌.. ఈ ఏడు ప్రావిన్స్‌లకు దూరంగా ఉండాలని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా […]

చెస్‌ ప్రపంచకప్ ఫైనల్‌కు దివ్య దేశ్‌ముఖ్.. తొలి భారత మహిళగా రికార్డు

దివ్య దేశ్‌ముఖ్ మాజీ ప్రపంచ ఛాంపియన్ ఝోంగ్వీ టాన్‎ను ఓడించి మహిళల ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా ఆమె చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా, ఆమె 2026లో జరగనున్న క్యాండిడేట్స్ టోర్నమెంట్‌‎కు కూడా అర్హత సాధించింది. దివ్య దేశ్‌ముఖ్ ఈ టోర్నమెంట్‌లో అంతకుముందు చైనాకు చెందిన జోనెర్ ఝూ, స్వదేశీ క్రీడాకారిణి డి హారికాను ఓడించింది. సెమీఫైనల్‌లో కూడా ఆమె తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఇప్పుడు ఆమె టైటిల్‌కు ఒక అడుగు […]

భారత్‌-యూకే మధ్య కీలక ట్రేడ్‌ డీల్‌..

భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ యూకే పర్యటన సందర్భంగా యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలో రెండు దేశాల మధ్య కీలక ట్రేడ్‌ డీల్‌ కుదిరింది. భారత్‌-యూకేల మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాలూ సంతకాలు చేశాయి. ప్రధాని మోదీ, యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌ సమక్షంలో ఇదరుదేశాల వాణిజ్య శాఖ మంత్రులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

లండన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..

రెండు రోజుల యూకే పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ లండన్‌కు చేరుకున్నారు. లండన్‌లోని విమానాశ్రయంలో యూకే విదేశాంగ మంత్రి, భారత హైకమిషన్‌ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిపై యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో ప్రధాని మోదీ చర్చలు జరపనున్నారు. భారత్‌-యూకేల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయనున్నారు.

మృతదేహాల తారుమారు ఆరోపణలు.. స్పందించిన కేంద్రం

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు సంచలన ఆరోపణలు చేశారు. యూకేకు పంపిన మృతదేహాలు తమ వారివి కావని డీఎన్ఏ పరీక్షల్లో తేలిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సహాయం విషయంలోనూ బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమతో బలవంతంగా సంతకాలు చేయించారని ఆరోపించారు. రెండు మృతదేహాలు తారుమారైనట్టు ఫ్యామిలీ ఆరోపణలు ఆరోపణలపై స్పందించిన భారత ప్రభుత్వం.. డీఎన్ఏ పరీక్షల్లో సమస్యపై కూడా యూకే అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటున్నాం’ అని విదేశాంగ శాఖ […]

ఆస్ట్రేలియాలో వ‌ర్ణ‌వివ‌క్ష‌.. భార‌తీయ విద్యార్థిపై దాడి

ఆస్ట్రేలియాలో భార‌తీయుడిపై అటాక్ జ‌రిగింది. 23 ఏళ్ల విద్యార్థి చ‌ర‌ణ్‌ప్రీత్ సింగ్‌ను కొట్టారు. సెంట్ర‌ల్ అడిలైడ్‌లో ఆ దాడి ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. వ‌ర్ణ‌వివ‌క్ష పేరుతో అటాక్(Racial Attack) జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. కింటోర్ అవెన్యూ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. సిటీ లైట్ డిస్‌ప్లేను చూసేందుకు భార్య‌తో క‌లిసి వెళ్లిన స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. జూలై 19వ తేదీన ఈ అటాక్ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

యునెస్కో నుంచి మళ్లీ వైదొలగుతున్న అమెరికా

ఐక్యరాజ్యసమితికి చెందిన విద్య, విజ్ఞాన,సాంస్కృతిక సంస్థ యునెస్కో నుంచి మళ్లీ వైదొలగుతున్నట్టు అమెరికా మంగళవారం ప్రకటించింది. యునెస్కోలో తిరిగి చేరి రెండేళ్లయిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. యునెస్కో నుంచి వైదొలగుతుండడం ఇది మూడో సారి. గతంలో ట్రంప్ హయాంలో ఒకసారి యునెస్కో నుంచి వైదొలగడం జరగ్గా, బైడెన్ ప్రభుత్వ కాలంలో ఐదేళ్ల విరామం తరువాత తిరిగి చేరడమైంది. ఇప్పుడు వైదొలగాలన్న నిర్ణయం 2026 డిసెంబర్ నుంచి అమలులోకి వస్తుంది.

ఢాకాలో స్కూల్‌పై కూలిన విమానం.. 27కు పెరిగిన మృతుల సంఖ్య

వైమానిక  దళానికి చెందిన శిక్షణ విమానం సోమవారం ఢాకా లోని ఓ స్కూలు భవనం పై కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం మేరకు ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 27కు పెరిగింది. వారిలో 25 మంది చిన్నారులు కాగా, ఇద్దరు టీచర్లు. మరో 171 మంది గాయపడ్డారు. ‘

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON