ఆస్ట్రేలియాలో భారతీయుడిపై అటాక్ జరిగింది. 23 ఏళ్ల విద్యార్థి చరణ్‌ప్రీత్ సింగ్‌ను కొట్టారు. సెంట్రల్ అడిలైడ్‌లో ఆ దాడి ఘటన చోటుచేసుకున్నది. వర్ణవివక్ష పేరుతో అటాక్(Racial Attack) జరిగినట్లు తెలుస్తోంది. కింటోర్ అవెన్యూ వద్ద ఈ ఘటన జరిగింది. సిటీ లైట్ డిస్‌ప్లేను చూసేందుకు భార్యతో కలిసి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. జూలై 19వ తేదీన ఈ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది.

