రెండు రోజుల యూకే పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ లండన్‌కు చేరుకున్నారు. లండన్‌లోని విమానాశ్రయంలో యూకే విదేశాంగ మంత్రి, భారత హైకమిషన్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిపై యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో ప్రధాని మోదీ చర్చలు జరపనున్నారు. భారత్-యూకేల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయనున్నారు.

